
రేషన్ పొందేందుకు అవస్థలు
● ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటిన గిరిజనులు
జి.మాడుగుల: మండలంలో కుంబిడిసింగి పంచాయతీలో పలు గ్రామాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. గెడ్డరాయి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో ఈ మార్గంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డంగిసింగిలోని డీఆర్‌డిపో నుంచి రేషన్ సరకులు తెచ్చుకునేందుకు కుంబిడిసింగి, రాయగెడ్డ తదితర గ్రామాల గిరిజనులు రేషన్ తెచ్చుకునేందుకు అవస్థలు పడ్డారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డను చేతి కర్రలు పట్టుకుని ఒకరికొకరు సాయంతో ఒడ్డుకు చేరారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. డీఆర్ డిపో నుంచి రేషన్ సరకులు తెచ్చుకునేందుకు అవస్థలు పడ్డారు.