
రోగులకు సత్వర వైద్యం అందించాలి
మిగతా 8వ పేజీలో
● కలెక్టర్ దినేష్‌కుమార్
● అడ్డతీగల సీహెచ్‌సీ తనిఖీ
అడ్డతీగల: ఆస్పత్రికి వచ్చిన రోగులకు వెంటనే వైద్య సేవలు అందజేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక సీహెచ్‌సీని తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాల వార్డులను పరిశీలించారు. ప్రతి రోగుకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గర్భిణుల వివరాలను తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న ఆహారంపై ఆరా తీశారు. బర్త్‌వెయిటింగ్ రూమ్‌లో ఎవ్వరూ లేకపోవడంపై ఆయన వైద్యులను ప్రశ్నించారు. ఆక్సిజన్ సదుపాయం లేనందున రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశామని వైద్యులు బదులిచ్చారు. ఎప్పటికప్పుడు వివిధ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆస్పత్రి పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా రోజూ నిర్వహించాలని ఆదేశించారు. రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం నొఖ్వాల్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, అడిషినల్ డీఎంహెచ్‌వో డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య లోపం వల్లే రోగాలు
రాజవొమ్మంగి: రోగాలకు