
షార్ట్ సర్క్యూట్‌తో బైక్ దగ్ధం
జి.మాడుగుల: మండలంలోని సొలభం వెళ్లే మార్గంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల–2 సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల బైక్ దగ్ధమైంది. మండంలోని వంజరి పంచాయతీ కొత్తూరుపాడు గ్రామానికి చెందిన కొర్రా కల్యాణం మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న కుమారుడు యోహాన్ వద్దకు తమ్ముడి బైక్‌పై బయలుదేరాడు. ఆశ్రమ పాఠశాలకు సమీపంలోకి వచ్చేసరికి సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పక్కకు తీసిన వెంటనే ఒక్కసారిగా బైక్‌లో మంటల వ్యాపించినట్టు కల్యాణం తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బైక్ వద్దకు వచ్చి మంటలు ఆర్పారు. అయితే అప్పటికే బైక్ దగ్ధమైంది. ఈ సమయంలో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.