
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
గంగవరం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వాలని, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా బోధన జరగాలని ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సూచించారు. మండలంలోని పాతరామవరం, పెద్దగార్లపాడు పాఠశాలలను ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పనిసరిగా లీవ్ హాజరు, ఆన్‌లైన్ హాజరు వేయవలెనని సూచించారు. విద్యార్థుల నోట్ పుస్తకాలు, వర్క్ బుక్‌లను పరిశీలించి సూచనలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం రుచి చూసి , ఆహారం మెనూ ప్రకారంగా రుచికరంగా వండారన్నారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌ఎం శ్రీనివాసరావు తదితరులున్నారు.