
చింతూరు డీఎఫ్‌వోగా రవీంద్రనాథ్‌రెడ్డి
చింతూరు: స్థానిక అటవీ డివిజన్ డీఎఫ్‌వోగా డి.రవీంద్రనాధ్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో డీఎఫ్‌వోగా పనిచేసిన ఆయన ప్రస్తుతం డెహ్రాడూన్‌లో శిక్షణ పూర్తి చేసుకుని చింతూరు డీఎఫ్‌వోగా నియమితులయ్యారు. కాగా ప్రస్తుతం చింతూరు డీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్న బబిత కూడా శిక్షణలో ఉన్నారు. మరోవైపు వైల్డ్‌లైఫ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐఎఫ్‌ఎస్ అధికారి శివకుమార్ గంగాల్‌ను చింతూరు అటవీ డివిజన్లోని లక్కవరం రేంజ్ సబ్ డీఎఫ్‌వోగా ప్రభుత్వం నియమించింది.