
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతూరు: మండలంలోని చట్టిలో జాతీయ రహదారి–30పై మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సవలం రమేష్(25) అనే యువకుడు మృతి చెందాడు. సుక్మా జిల్లా పందిగూడకు చెందిన రమేష్ తన స్నేహితుడితో కలసి బైక్‌పై చట్టి గ్రామం నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న క్రమంలో మారేడుమిల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతిచెందగా మారేడుమిల్లి మండలం సున్నంపాడుకు చెందిన మడకం శ్రీను, చింతూరు మండలం బలిమెలకు చెందిన ముచ్చిక కోనయ్యకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.