
సంపత్ వినాయగర్‌హుండీ ఆదాయం లెక్కింపు
మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయంలో వినాయక ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన హుండీ ఆదాయం లెక్కింపులో 12 రోజుల్లో రూ. 14,55,243 ఆదాయం లభించింది. ఈ లెక్కింపులో 5 గ్రాముల బంగారం, 101 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి, జిల్లా సహాయ కమిషనర్ డి.వి.వి. ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా విదేశీ కరెన్సీలైన 21 అమెరికా డాలర్లు, 4 ఒమాన్ రియల్స్, 10 కెనడా డాలర్లు, 10 యూరోలు, 10 ఇంగ్లాండ్ పౌండ్లు కూడా లభించాయి. లెక్కింపు కార్యక్రమంలో జగన్నాథ స్వామి ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షించగా, వేంకటేశ్వర సేవా సంఘం సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. లభించిన ఆదాయాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆశీలమెట్ట బ్రాంచ్‌కు అందజేశారు.