
కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలి
● ‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ’ సభలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పిలుపు
● తరలివచ్చిన పార్టీ శ్రేణులు, గ్రామస్తులు
గంగవరం : కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలు, అరాచకాలను, మోసాలను గ్రామస్థాయిలో ప్రజల్లో కి తీసుకువెళ్లాలిసిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఆవరణలో పార్టీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అరకొరగా అమలు చేసి నూరుశాతం సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలను మోసం చేసిందని అందుకే వారి తరపున వారి ప్రజలు గొంతుకై వైఎస్సార్‌సీపీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ ప్రజల వద్దకు పాలన తీసుకురావడం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంస్కరణలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని ధ్వంసం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీలను ఇచ్చి గద్దినెక్కిన కూటమి ప్రభుత్వం వాటిన అమలు చేయడంలో కాకమ్మ కథలు చెబుతున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించేందుకు శ్రద్ధ చూపిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. జగనన్న హయాంలో అనేక సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరిగిందని గుర్తు చేశారు. 2029లో మళ్లి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అదైర్య పడాల్సిన అవసరం లేదని అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. రంపచోడవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు , జెడ్పీటీసీ సభ్యురాలు బేబిరత్నం , ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీలు గంగాదేవి, రామ తులసి, పార్టీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగిస్తూ ప్రతీ గ్రామంలో చేపట్టనున్న బాబు షూర్యిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఎంపీటీసీ సభ్యులు కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, సర్పంచ్‌లు కామరాజు, మరిడమ్మ, శివ, రమణమ్మ, రామలక్ష్మి, కురసం అక్కమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, పార్టీ మండల ఇన్‌చార్జి సీహెచ్.రఘునాఽథ్ తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలి