
యూరియా కొరతపై పోరాటం
● రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ
● ఈనెల 9న నిరసన ర్యాలీ
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● విజయవంతం చేయాలని పిలుపు
అరకులోయ టౌన్: యూరియా కొరతపై వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన పోరాడుతుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్‌ను ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్‌లో బస్తా రూ.200 నుంచి రూ.300 వరకు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై అన్నదాత పోరు పేరిట రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువులు సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఆర్‌బీకేల ద్వారా సకాలంలో ఎరువులు పంపిణీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడం లేదన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా ఇతర ఎరువులు రాయితీపై పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి అధికారులకు సబ్ కలెక్టర్, కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇస్తామన్నారు. రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, పార్టీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9వ తేదీ మంగళవారం అధ్యక్షుడు స్వాభి రామూర్తి, మండల ఉపాధ్యక్షుడు పల్టాసింగి విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, ఉమ్మడి విశాఖ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మండల కార్యదర్శి సోనియా, పార్టీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గెడ్గం నర్సింగరావు పాల్గొన్నారు.