
మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రదర్శన
విశాఖ స్పోర్ట్స్ : మహిళల క్రికెట్ ప్రపంచకప్‌కు తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖలో ఆదివారం విజేతలకు అందించే ట్రోఫీని ప్రదర్శించారు. ప్రస్తుతం వైఎస్సార్ స్టేడియంలో జరుగుతున్న మహిళల క్రికెట్ లీగ్ సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మిథాలీ రాజ్ మెంటార్‌గా వ్యవహరించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా గ్రామీణ పాఠశాల స్థాయి క్రీడాకారిణులకు అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచకప్‌లోని ఐదు మ్యాచ్‌లకు విశాఖ వేదిక కానుంది.