
అంగన్‌వాడీల్లో అక్రమాలకు అడ్డుకట్ట
● ఐసీడీఎస్ పీవో ఝాన్సీరామ్ పడాల్
సీలేరు: గర్భిణులు, బాలింతలు చిన్నపిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడకుండా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేపట్టే సరకుల సరఫరాలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ ఝాన్సీ రాయి పడాల్ చెప్పారు. పాడైన బాలామృతం ప్యాకెట్లు పంపిణీ విషయంపై ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నేరుగా లబ్ధిదారులకు కంపెనీలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేక అనుమతులతో సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్‌ను అంగన్‌వాడీ కేంద్రాలకు అనుసంధానం చేస్తున్నామని ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి వారానికి ఒకసారి సూపర్‌వైజర్, మహిళా పోలీసు వెళ్లి సరకుల పంపిణీపై లబ్ధిదారులతో మాట్లాడి, స్టాకు వివరాలతో కూడిన నివేదిక అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఐదు మండలాల్లో ఇబ్బందులున్న అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న వర్కర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. వారు పనితీరు మార్చుకోకపోతే మూడు మెమోలు అనంతరం వారిని విధులు నుంచి తొలగించడం కూడా జరుగుతుందన్నారు. ముఖ్యంగా జీకే వీధి మండలంలో సీలేరు, దుప్పులువాడ, దారకొండ, గుమ్మరేవులు మారుమూల సరిహద్దు కేంద్రాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై దృష్టి సారించినట్టు చెప్పారు.