మంచు.. మండే ఎండ.. వాన | - | Sakshi
Sakshi News home page

మంచు.. మండే ఎండ.. వాన

Aug 7 2025 7:50 AM | Updated on Aug 7 2025 7:58 AM

మంచు.

మంచు.. మండే ఎండ.. వాన

చిక్కీలు నాసిరకం.. ఆరోగ్యానికి హానికరం
కోరలు చాస్తున్న కరువు

గిరిజన ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు నాణ్యత లోపించిన వేరుశనగ చిక్కీలను పంపిణీ చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అప్పలరాజుపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని పాకం కారుతున్న నాణ్యత లేని చిక్కీలు పంపిణీ చేశారు. ఇవి తమ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారి తల్లిదండ్రులు ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖాధికారి 1 సత్యనారాయణదొరను వివరణ కోరగా నాసిరకం చిక్కీలు పెట్టడం పిల్లల ఆరోగ్యానికి హానికరమన్నారు. గురువారం సంబంధిత పాఠశాలను సందర్శించి చిక్కీలను పరిశీలిస్తామన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి నాణ్యమైన చిక్కీలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

– రాజవొమ్మంగి

మన్యంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. బుధవారం ఉదయం పాడేరు ప్రాంతంలో పొగమంచు కురువగా సాయంత్రం వరకు భానుడు చుర్రుమనిపించాడు. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కారుమబ్బులు కమ్ముకుని జల్లులు కురిశాయి. జిల్లా కేంద్రం పాడేరులో కనిష్టంగా 22.8 డిగ్రీలు, గరిష్టంగా 35.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

–సాక్షి, పాడేరు

మంచు.. మండే ఎండ.. వాన 1
1/4

మంచు.. మండే ఎండ.. వాన

మంచు.. మండే ఎండ.. వాన 2
2/4

మంచు.. మండే ఎండ.. వాన

మంచు.. మండే ఎండ.. వాన 3
3/4

మంచు.. మండే ఎండ.. వాన

మంచు.. మండే ఎండ.. వాన 4
4/4

మంచు.. మండే ఎండ.. వాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement