
దయనీయం
సిండికేట్ల రాజ్యం
దిగుబడి బాగున్నా..
ఏజెన్సీలోని పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో సుమారు 1400 ఎకరాల విస్తీర్ణంలో అల్లంను ఖరీఫ్‌లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభం కావడంతో గత నెల రోజుల నుంచి ఏజెన్సీలోని వారపుసంతల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే సీజన్ ప్రారంభం నుంచి గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో కిలో అల్లంను రూ.40 నుంచి రూ.50కు వ్యాపారులు కొనుగోలు చేశారు. అదే వ్యాపారులు ఈ ఏడాది కిలో అల్లంను రూ.20 నుంచి రూ.25కు మించి కొనుగోలు చేయడం లేదని గిరి రైతులు వాపోతున్నారు.
వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది ఎకరాకు ఆరు టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇక్కడ పండించే అల్లం ఘాటుగా ఉండటంతో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, విజయనగరం, తెలంగాణా ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల గతేడాదితో పోలిస్తే కిలోకు రూ.20 వరకు గిరిజన రైతులు ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
సాక్షి, పాడేరు: అల్లం పండించే గిరి రైతులకు గిట్టుబాటు ధర కరువైంది. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర పతనం చేయడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే అల్లంకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయినా గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. వీరి వద్ద వ్యాపారులు కిలో రూ.25కు కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.60కు విక్రయిస్తున్నారు. కష్టపడి పండించిన రైతుకు శ్రమ మిగులుతుండగా వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు.
డుంబ్రిగుడ ప్రాంతంలో అల్లం తవ్వకాలు
అల్లం రైతుల ఆశలు ఆవిరి
అనుకూలించిన వాతావరణం
సంతల్లో గిట్టుబాటు కరువు కిలో రూ.25కు మించని వైనం మైదాన ప్రాంతాల్లో రూ.60కు అమ్మకం వ్యాపారులకు లాభాలు గిరి రైతులకు నష్టాలు
హుకుంపేట, అరకు, కించుమండ, పెదబయలు, సుంకరమెట్ట, కాశీపట్నం, జి.మాడుగుల, అన్నవరం, చింతపల్లి వంటి పెద్ద వారపుసంతల్లోను వ్యాపారుల సిండికేట్ రాజ్యమేలుతుంది.అల్లం ధరలను పతనం చేసి వ్యాపారం చేస్తూ మైదాన ప్రాంతాలకు భారీగా రవాణా చేస్తున్నారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడటం వల్ల నష్టపోతున్నామని, ప్రభుత్వం తమకు మద్దతు ధర కల్పించాలని అల్లం రైతులు కోరుతున్నారు.

దయనీయం