
స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి
డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు
పాడేరు: ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆరునెలలకు ఒకసారి ప్రతి అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పిల్లలకు, విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎంఎల్‌హెచ్‌పీలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు రాష్ట్రీయ బాలల స్వస్త్యా కార్యక్రమం నిర్వహించారు. పిల్లల పెంపకం సంరక్షణ, కుటుంబం, సంఘానికి సాధికారిత చేకూర్చే అంశాలపై వారికి అవగాహన కల్పించారు. స్క్రీనింగ్ పరీక్షల్లో ఎవరికై నా అనారోగ్యం, 4డీ(బర్త్ డెఫిక్ట్స్, డెపిషియన్సీస్, డీసిజెస్, డెవలప్‌మెంట్ డిలే) గుర్తిస్తే తక్షణమే జిల్లా ఆస్పత్రిలో చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో, ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రతాప్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ జె. కై లాష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్,గ్రీష్మ, వై. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.