
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
చింతూరు: ఒడిశా నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ రమేష్ తమ సిబ్బందితో కలసి స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయ గా 12 కేజీల గంజాయి లభ్యమైందని, విలువ రూ.60 వేలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు.గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న తెలంగాణకు చెందిన నవీన్‌కుమార్, రాజు, అశోక్, చింతూరుకు చెందిన అబ్బాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.