కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని నష్టం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని నష్టం

Aug 6 2025 6:34 AM | Updated on Aug 6 2025 6:34 AM

కూటమి

కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని నష్టం

● ఎరువుల కొరతతో సతమతం ● ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతులకు వర్తించని అన్నదాత సుఖీభవ ● అరకు ఎమ్మెల్యే మత్య్సలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ఆవేదన ● పలు సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో జేసీ అభిషేక్‌ గౌడకు వినతిపత్రం

పాడేరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో వారికి అన్నివిధాల తీవ్ర నష్టం జరుగుతోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం స్థానిక ఐటీడీఏలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ యూరియాతో పాటు ఎరువుల కొరత అధికంగా ఉన్నందున రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతోందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదివాసీలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసి వాటికి కూడా వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించిందన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలకు అన్నదాత సుఖీభవ వర్తింపజేయలేదన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులను తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. తమ పార్టీ రైతు పక్షపాతి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిత్యం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్‌, నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పాడేరు వైస్‌ ఎంపీపీ కొంతూరు కనకాలమ్మ, పాడేరు, జి.మాడుగుల, పెదబయలు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, నుర్మనీ మత్య్సకొండం నాయుడు, మజ్జి చంద్రుబాబు, గ్రీవెన్స్‌ సెల్‌ అరకు నియోజకవర్గ అధ్యక్షుడు సందడి కొండబాబు, వైఎస్సార్‌సీపీ పాడేరు మండల ఉపాధ్యక్షులు వనుగు బసవన్నదొర, లకే రామసత్యవతి, ప్రధాన కార్యదర్శి వంతాల రాంబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని నష్టం 1
1/2

కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని నష్టం

కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని నష్టం 2
2/2

కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement