
ఉపాధి హామీ నిధులు పక్కదారి
● అధికారుల చేతివాటం ● సుమారు రూ.12 లక్షలుపథకం ప్రకారం దారిమళ్లింపు ● గుంజివీధి, చెరువూరు రైతుల ఫిర్యాదు ● పీడీ విద్యాసాగర్ విచారణలో వెల్లడైన అవినీతి ● రికవరీకి చర్యలు తీసుకుంటామని వెల్లడి
చింతపల్లి: మండలంలోని బలపం పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకం మొక్కల పంపిణీలో రూ.12 లక్షల మేర ప్రోత్సాహక నిధులు పథకం ప్రకారం పక్కదారి పట్టించారు. ఆ సంస్థ పీడీ డీవీ విద్యాసాగర్ మంగళవారం చేపట్టిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బలపం పంచాయతీ పరిధి 2022–23లో 220 మంది రైతులకు జీడిమామిడి, సపోటా, చింత, సిల్వర్‌వోక్ మొక్కలను జాతీయ ఉపాధి హామీ పథకంలో పంపిణీ చేశారు. వీరికి మొక్కల పెంపకానికి సంబంధించి మూడేళ్ల వరకు ప్రోత్సాహక నిధులు అందించాల్సి ఉంది. అయితే మొక్కలు వేసుకున్న రైతులకు 2023–24లో చెల్లించాల్సిన ప్రోత్సాహక నిధులు రూ.12,95,412 వారికి పంపిణీ చేయలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ కొంటా కోటి భార్యను మొక్కల పంపిణీ కాంట్రాక్టర్‌గా చూిపించి అప్పటి ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులు తన వ్యక్తిగత ఖాతాలో జమచేశారు. అదేవిధంగా 24–25లో 26 మంది రైతులకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అందజేశారు. వీరికి అర ఎకరానికి మొక్కలు నాటేందుకు 250 సిమెంటు స్తంభాల చొప్పున పంపిణీ చేయాలి. వీటిని కూడా తామే సరఫరా చేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పినప్పటికీ నేటివరకు చెల్లించలేదు. ఇందుకు సంబంధించిన
మిగతా 10వ పేజీలో