
గ్రామస్థాయి కమిటీలు అంకితభావంతో పనిచేయాలి
అరకులోయ టౌన్(అనంతగిరి): గ్రామస్థాయిలో గ్రామ కమిటీలు అంకితభావంతో బాగా పనిచేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని గుమ్మ, పెద్దబిడ్డ, లుంగపర్తి పంచాయతీల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లోని వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీల ఎన్నికను మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మత్స్యలింగం కమిటీ ఎన్నిక ప్రక్రియను సమీక్షించారు. నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గుమ్మ, పెద్దబిడ్డ, లుంగపర్తి గ్రామ కమిటీల అధ్యక్షులుగా జాగరపు వీరన్న, శిరగం గంగునాయుడు, పుట్టబోయిన పండన్నలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గ్రామస్థాయిలో కమిటీలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు కమిటీ సభ్యులు ఏకతాటిపై వచ్చి రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ శెట్టి నీలవేణి, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్నదొర, ఎస్టీ సెల్ అరకు నియోజకవర్గ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, పార్టీ ఉపాధ్యక్షుడు పాడి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, లక్ష్మణరావు, సర్పంచులు అప్పారావు, సన్యాసిరావు, రాములమ్మ, పెంటమ్మ, ఎంపీటీసీలు జయశ్రీ, మిథుల, నాయకులు లక్ష్మణ్, శ్రీను, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం