
కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
చింతూరు: విశ్వ కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోడె మురళి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గురుకుల పాఠశాలలో పరిషత్, కోయత్తోర్‌బాట ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో కోయ పద్యాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మురళి మాట్లా డుతూ ఈనెల 21న జరిగే కోయభాష దినో త్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ ప్రకారం కోయభాషకు జాతీయ భాషగా గుర్తింపు కల్పించాలని, ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషలో విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో కోయభాష బోధించేందుకు వలంటీర్లను నియమించాలని, ఆదివాసీ పూజారు లకు గౌరవవేతనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శీలం కృష్ణ, మినప నాగేశ్వరరావు, సోడె వెంకటేశ్వర్లు, రాఘవయ్య, లోకేష్, వరణ్‌సందీప్, సంతోష్ పాల్గొన్నారు.