
పర్యాటకుల జోష్
జి.మాడుగుల/డుంబ్రిగుడ: జిల్లా లోని పలు టూరిస్టు ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొత్తపల్లి జలపాతం, చాపరాయి జలవిహారి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు. కొత్తపల్లి జలపాతం వద్ద వ్యూపాయింట్, మెట్ల మార్గంతో పాటు గార్డెన్‌లో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. పెద్దపెద్ద బండరాళ్లపై నుంచి పడుతున్న నీటి ప్రవాహంలో అన్ని వయసుల వారు కేరింతలతో జలకాలాడారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో చాపరాయి గెడ్డ పొంగి ప్రవహించింది. దీంతో గత రెండు వారాలు పర్యాటకులను జలవిహారి లోపలికి అనుమతించలేదు. మైదాన ప్రాంతం నుంచి వచ్చిన పర్యాటకులు హోటల్ గదుల్లోనే సేదతీరి, నిరాశతో వెనుతిరిగారు. ఈ వారం అనుమతించడంతో నీటిలో దిగి జలకాలాడుతూ సందడి చేశారు. రోజంతా ఉత్సాహంగా గడిపారు.

పర్యాటకుల జోష్