
పెన్షనర్ల ధర్నా
● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
సాక్షి,పాడేరు: అఖిల భారత పింఛనుదారులు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘం పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పింఛనుదారులు మంగళవారం ధర్నా చేశారు. పెండింగ్ డీఏలు చెల్లించాలని వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో పింఛనుదారుల సంక్షేమ సంఘ ప్రతినిధులు ఆర్.నాగభూషణరాజు, శ్రీహరి, మోహన్‌రావు, కృష్ణారావు,గంగన్నపడాల్, ఎల్.కృష్ణ. వైవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.