● దిగజనబలో చదువుకు
దూరమవుతున్న చిన్నారులు
చింతపల్లి: మండలంలో దిగజనబ గ్రామంలో పాఠశాల మూతబడడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. బలపం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు పాఠశాల తెరచుకోలేదు. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడికి బదిలీ అయింది. ఆయన స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. బలపం స్కూల్‌కాంప్లెక్స్ నుంచి డిప్యూటేషన్‌పై ఒక ఉపాధ్యాయుడిని పంపించాలని ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మిని ట్రైబల్ వెల్ఫేర్ ఇన్‌చార్జి డీడీ రజని ఆదేశించారు. అయితే మంగళవారం వరకు ఉపాధ్యాయుడు వెళ్లకపోవడంతో పాఠశాల మూతబడి ఉంది. దీనివల్ల తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉపాధ్యాయుడి నియామకానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.