
యాంత్రీకరుణ
నాగరికత ఎంత ముందుకు సాగుతున్నా.. నాగలి కదలాలంటే దుక్కిటెడ్లు ఉండాల్సిందే. ఏజెన్సీలో ఇవి మరింత కీలకం. వ్యవసాయ యాంత్రీకరణ పేరిట ప్రభుత్వాలు ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నా గిరి రైతులు వీటిని అందుకోలేకపోతున్నారు. దీనివల్ల ఇప్పటికీ వ్యవసాయ పనులు చేపట్టేందుకు పశుసంపదపై ఆధారపడుతున్నారు. తొలకరి ఆగమనం.. ఖరీఫ్ ప్రారంభంతో వారపు సంతల్లో వీటి కొనుగోళ్లు జోరందుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో వ్యయ ప్రయాసలకు గురువుతున్నారు.
గిరి రైతును చేరని
భారంగా దుక్కిటెద్దుల కొనుగోలు
● ప్రభుత్వం నుంచి సహకారం కరువు ● గిరి రైతులకు తప్పని వ్యయప్రయాస
జి.మాడుగుల: ఏజెన్సీలో వారపు సంతలు పాడిపశువుల క్రయ విక్రయాలతో కళకళలాడుతున్నాయి. వ్యవసాయ పనులు చేపట్టేందుకు అధిక శాతం గిరిజన రైతులు పశువులపై ఆధారపడుతుంటారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో దుక్కి టెద్దులను కొనుగోలు చేస్తుంటారు. పోషణ భారం కారణంగా వ్యవసాయ సీజన్ ముగిసిన వెంటనే వారపు సంతకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. ఏజెన్సీలో 80 శాతం గిరిజనులకు వ్యవసాయమే జీవనాధారం. ఈ ఏడాది వేసవిలో విస్తారంగా వర్షాలు కురవడంతో గిరి రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. వారపు సంతల్లో ఆరోగ్యకరమైన,బలిష్టంగా ఉన్న ఎడ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
భారీగా పెరిగిన ధరలు
పాడేరు డివిజన్‌లో జి.మాడుగుల, గుత్తులపుట్టు, అన్నవరం, హుకుంపేట, చింతపల్లి తదితర వారపుసంతల్లో ఎడ్లు, పశువుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో ఎడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. జత ఎడ్లు (ఆరోగ్యం,బలిష్టంగా ఉన్నవి) రూ.40 వేల నుంచి 50 వేల వరకు ధర పలుకుతోంది.
● గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఎద్దులు, పశువులు లేని సన్న, చిన్నకారు గిరిజన రైతులు కూలీలపై ఆధారపడుతున్నారు. కూలి ధరలు భారీగా పెరగడంతో సాగు కష్టంగా మారిందని గిరి రైతులు వాపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటలపాటు (జత ఎడ్లు) పొలం దున్నేందుకు రూ.500 నుంచి 600 ఖర్చవుతుందని వారు వివరించారు. పారకట్టు, పట్టి పట్టటం తదితర పనులకు అధిక మొత్తంలోనే ఖర్చవుతుందన్నారు. కూలీల కొరత కూడా ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయ పనులకు ఎద్దులు, పశువులు అందుబాటులో ఉంటే వ్యవసాయ ఖర్చులు కొంతవరకు తగ్గుతాయని, కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదన్నారు.
● వ్యవసాయ సీజన్ కావడంతో పశువుల ధరలు అమాంతం పెంచేశారు. దీనిలో దళారుల ప్రభావం ఎక్కువగా ఉంది. కూలీల డిమాండ్ నేపథ్యంలో దుక్కి టెద్దులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని గిరి రైతులు వివరించారు. కొనుగోలు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం లేకపోయినప్పటికీ అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
వారపు సంతల్లో భారీగా క్రయవిక్రయాలు
అమాంతం పెరిగిన ధరలు
ఏటా ఎడ్లను అమ్మేస్తాం
ఖరీఫ్ వ్యవసాయ పనులకు వినియోగించిన తరువాత ఎడ్లతో పెద్దగా పని ఉండదు. దీనివల్ల అవి బలహీనపడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా అమ్మేస్తాం. ఏటా ఈ విధంగానే చేస్తాం.పశువులను ఇళ్ల వద్ద ఉంచుకొని పోషించడం ఇబ్బందికరంగా ఉంటుంది. పశువులకు జబ్బులు రావటం, బలహీనపడటం వల్ల పశునష్టం జరిగే పరిస్థితులు ఉంటాయి.
– అప్పారావు, గిరిజన రైతు,
జర్రాయి, జి.మాడుగుల
బలమైన ఎడ్లను కొంటేనే ఉపయోగం
వారపు సంతలకు వచ్చే పశువుల్లో ఆరోగ్యంగా ఉన్న, బలమైన ఎడ్లను ఎంపిక చేసి చేయడం వల్ల వాటి ద్వారా వ్యవసాయం పనులకు ఇబ్బంది ఉండదు. అందువల్ల బలంగా ఉన్న ఎడ్లను కొనుగోలు చేస్తున్నాం. గిరిజన ప్రాంత వాతావరణాన్ని తట్టుకుని దుక్కి పనులు చేయాలంటే పశువులు బలిష్టంగా ఉండాలి. పాత ఎడ్లును అమ్మేసి, కొత్త ఎడ్లను రూ.40వేలకు కొన్నా.
– చిన్నబ్బాయి, గిరిజన రైతు, ఎస్.పెదబయలు, జి.మాడుగుల మండలం

యాంత్రీకరుణ

యాంత్రీకరుణ

యాంత్రీకరుణ

యాంత్రీకరుణ