
సూరంపాలెం ఆయకట్టుకు నీరు విడుదల
గంగవరం : మండలంలోని సూరంపాలెం రిజర్వాయర్ నీటిని గంగవరం, గోకవరం, కోరుకొండ మండలాల్లోని ఆయకట్టుకు రంపచోడవరం, జగ్గంపేట ఎమ్మెల్యేలు మిరియాల శిరిషాదేవి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమెతోపాటు జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఈ ప్రసాద్, సాగునీటి సంఘ చైర్మన్ ఉంగరాల రాము, వైస్‌చైర్మన్ రాంబాబు, మొల్లేరు సొసైటీ చైర్‌పర్సన్ పాము అర్జున, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, మాజీ వైస్‌ఎంపీపీ కనిగిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.