
గురువుల్లేని పాఠశాలల్లో బోధన ఎలా?
గూడెంకొత్తవీఽఽధి: గురువులు లేని పాఠశాలలకు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పంపించాలని, వారి భవిష్యత్ ఏమిటని, కూటమి ప్రభుత్వ తీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన శుక్రవారం మండల సమావేశం జరిగింది. మండలంలో 50 పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకకపోవడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరుగుతుందని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. సర్పంచ్‌లు కమలమ్మ, కృష్ణవంశీ, గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు అధికారుల తీరుపై మండిపడ్డారు. మూడు నెలలు ఒకసారి నిర్వహించే సమావేశాలు నామమాత్రంగా మారాయన్నారు. చేసిన తీర్మాణాలకు విలువ ఇవ్వడం లేదన్నారు.సమస్యలు అసలు పరిష్కారం కావడం లేదని వాపోయారు.సమస్యలు పరిష్కారం కాలేనప్పుడు సమావేశాలు ఎందుకుని నిలదీశారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో మహేష్, తహసీల్దార్ అన్నాజీరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కళ్యాణ్, ఏటీడబ్ల్యూవో లక్ష్మి, ఏవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో
విద్యాశాఖ తీరుపై సభ్యుల ధ్వజం

గురువుల్లేని పాఠశాలల్లో బోధన ఎలా?