
కై లాసగిరిని సందర్శించిన ఇస్రో చైర్మన్
ఆరిలోవ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ నారాయణన్ శుక్రవారం విశాఖలోని కై లాసగిరిని సందర్శించారు. గురువా రం సాయంత్రమే నగరానికి చేరుకున్న ఆయన, తన పర్యటనలో భాగంగా కై లాసగిరిని సందర్శించారు. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి కొండలు, సముద్రం అందాలను తిలకించిన నారాయణన్, కై లాసగిరిపై నిర్వహిస్తున్న జిప్‌లైన్, స్కై సైక్లింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలను ఆసక్తిగా పరిశీలించారు. వాటితో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి అడ్వెంచర్‌ను కూడా పరిశీలించారు. వాటి నిర్వహణ, సందర్శకుల ఆసక్తి గురించి అడ్వెంచర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివపార్వతుల విగ్రహాల వద్ద, ఆయన వెంట పలు విభాగాలకు చెందిన అధికారులున్నారు.