
పొగాకు ఉత్పత్తులవిక్రయదారులకు జరిమానా
రంపచోడవరం: పాఠశాలలు, కళాశాలలకు వంద మీటర్ల లోపల పొగాకు ఉత్పత్తులు, పాన్‌పరాగ్ అమ్ముతున్న వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సీఐ రవికుమార్ తెలిపారు. రంపచోడవరం, పెదగెద్దాడ, బోర్నగూడెం గ్రామాల్లో పాఠశాలలు, కళాశాలలకు వంద మీటర్ల లోపల పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న ఏడుగురుపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 200 జరిమానా విధించామని చెప్పారు. అలాగే బహిరంగ ధూమపానం చేస్తున్న ఒకరికి రూ. 200 ఫైన్ విధించినట్లు సీఐ వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది డి భూషణం, నాగమణి, ఇందిర, శ్రావణి పాల్గొన్నారు.