
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి: అనకాపల్లి–కశింకోట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలు వయస్సుగల వ్యక్తి మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ లక్ష్మి ఆదివారం చెప్పారు. మృతుడి ఎత్తు 5.3 అడుగులు, జుట్టు నలుపు రంగు కలరింగ్, తల నుజ్జునుజ్జు అయ్యి గుర్తు పట్టలేని విధంగా మృతి చెందినట్టు ఎస్‌ఐ చెప్పారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించాలని కోరారు.