
నేడు చింతపల్లిలో ఎంపీ,ఎమ్మెల్యే పర్యటన
చింతపల్లి: మండలంలో సోమవారం అరకు పార్లమెంటు సభ్యురాలు గుమ్మ తనూజారాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పర్యటించనున్నట్లు స్థానిక ఎంపీపీ కోరాబు అనూషదేవి తెలిపారు.ఈ సందర్భంగా మండలంలో గల 17 పంచాయతీలకు మండల పరిషత్ కార్యాలయంలో వీధి దీపాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.అనంతరం స్థానిక డెయిరీ ఫారం ప్రాంగణంలో రూ.40 లక్షలతో నిర్మించనున్న కల్యాణ మండపానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్‌లు ,ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షలు, నాయకులు హాజరు కావాలని ఎంపీపీ కోరారు.