
రోడ్డెక్కిన జిమ్నాస్ట్‌లు
విశాఖ స్పోర్ట్స్: ఆదివారం బీచ్ రోడ్డులో జరిగిన ఒలింపిక్ డే రన్.. జిమ్నాస్ట్‌లు, వారి తల్లిదండ్రుల నిరసనలకు వేదికై ంది. పాండురంగాపురంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) హాలులో కొన్నేళ్లుగా సాధన చేస్తూ.. పతకాలు సాధిస్తున్న జిమ్నాస్ట్‌లను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి స్థానంలో వెటరన్ క్రీడాకారులకు బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి ఆ ప్రాంగణాన్ని కేటాయించాలనే ప్రతిపాదన ఈ ఆందోళనకు కారణమైంది. తమకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని నిరసిస్తూ.. చిన్నారులు ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్న పెద్దల ఎదుటే ప్లకార్డులు ప్రదర్శించారు. ‘మా హాలును మాకే ఇవ్వండి’.. కలెక్టర్ గారూ స్పందించండి అంటూ నినాదాలు చేశారు. అయితే జిల్లా ఒలింపిక్ సంఘానికి పెద్దగా వ్యవహరిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న నాయకుడు ఈ నిరసనను చూసీ చూడనట్టు ముందుకు సాగడం విమర్శలకు తావిస్తోంది. క్రీడలను బతికిస్తున్నామని చెప్పుకునే నాయకుల కళ్ల ముందే క్రీడాకారులు రోడ్డెక్కడంతో.. ఇంతకంటే దారుణం ఏముంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
దిగజారుతున్న పరిస్థితులు
వాస్తవానికి విశాఖలో క్రీడల పరిస్థితి దయనీయంగా మారింది. టోర్నమెంట్లు నిర్వహించడం, సర్టిఫికెట్లు పంచుకోవడం, సత్కారాలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. క్షేత్రస్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడంపై లేదన్నది బహిరంగ రహస్యం. జిల్లా నుంచి ఎంత మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారో కూడా జిల్లా క్రీడాసంస్థ వద్ద వివరాలు లేకపోవడం ఇక్కడి నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఒలింపిక్ పతకాలు సాధించడం మాట అటుంచి.. ఆ స్థాయికి చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు కొరవడ్డాయి. ఒలింపిక్ స్థాయికి స్వశక్తితో వెళ్లిన స్థానిక అథ్లెట్ జ్యోతి సైతం స్థానికంగా ప్రోత్సాహం లేదని ఇటీవల ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ఇక జిల్లా ఒలింపిక్ సంఘం కేవలం రన్‌లు నిర్వహించి, తమకు నచ్చిన వారికి సత్కారాలు చేసుకోవడానికే పరిమితమైంది. క్రీడా సంఘాల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
జిమ్నాస్ట్‌లకు మద్దతు ఇవ్వండి
ఒకప్పుడు డీఎస్‌ఏ కార్యాలయం ఉన్న స్థలం చేజారిపోయి, ప్రస్తుతం ఒక హాలు మాత్రమే మిగిలింది. ఇక్కడ కొన్నేళ్లుగా చిన్నారులు జిమ్నాస్ట్‌లు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పతకాలు సాధిస్తున్న జిమ్నాస్ట్‌లకు అండగా నిలవాల్సింది పోయి.. వారి సాధనకే ఆటంకం కలిగించడం పట్ల క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఈ జిమ్నాస్ట్‌లు.. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెబుతున్నారు. ఒలింపిక్స్‌లో పతకాల గురించి ప్రగల్భాలు పలికే ముందు.. ఉన్న క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.
ఒMýS OÐðlç³# {MîSyé çÜ*¹Ç¢° ò³…´÷…¨…^é-ÌS…r* JÍ…-í³MŠS yól Æý‡¯Œl õ³Æý‡$™ø Art-à-çÜ…V> M>Æý‡Å-{MýSÐ]l$… fÆý‡$-VýS$™ø…-¨. Ð]l$Æø-OÐðlç³# Ķæ¬Ð]l {MîSyé-M>-Æý‡$Ë$ ™èlÐ]l$MýS$ {´ëMîSt‹Ü ^ólçÜ$-MýS$-¯ól…-§ýl$MýS$ E¯]l² ஒJMýSP ^ør$¯]l$ M>´ë-yýl-Ð]l$…r* ç³ÏM>-Æý‡$zÌS™ø °Æý‡çܯ]l ™ðlË$-ç³#-™èl$-¯é²Æý‡$. {MîSyé-À-Ð]l–-¨®MìS ´ër$-ç³-yé-ÍÞ¯]l ò³§ýlªË$ ÐéÇ BÐól§ýl-¯]l¯]l$ ç³sìæt…^èl$-Mø-MýS$…yé ¯]lÐ]l#Ó™èl* Æ>ÅÎÌZ Ð]l¬…§ýl$MýS$ ÝëVýS$-™èl$-¯é²Æý‡$. D _{™èl… ÑÔ>Q {MîSyé-Æý‡…VýS…ÌZ ¯ðlÌS-Mö¯]l² §ýlĶæ$-±Ä¶æ$ ç³Çíܦ-™èl$-ÌSMýS$ A§ýlª… ç³yýl$-™ø…-¨.
ఒలింపిక్ రన్ వేళ ప్లకార్డులతో నిరసన సాధన చేసుకునే హాలును
ఇతరులకు ఇవ్వొద్దని నినాదాలు
కలెక్టర్ స్పందించాలని వినతి

రోడ్డెక్కిన జిమ్నాస్ట్‌లు