
మత్స్యగెడ్డకు భారీగా వరదనీరు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మత్స్యగెడ్డలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సుజనకోట,పనసపుట్టు,పెదగూడ,దారెల,జోలాపుట్టు,మాకవరం,వనుగుమ్మ,దొడిపుట్టు పంచాయతీల్లో పూర్తి స్థాయి నీటితో మత్స్యగెడ్డ పాయలు దర్శనం ఇస్తున్నాయి. దీనికితోడు జోలాపుట్టు జలాశయం గేట్లు మూసి ఉండడంతో క్రమేపి జలాశయం,మత్స్యగెడ్డలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. మత్స్యగెడ్డలో నీరు ఎక్కువగా ఉండడంతో గిరిజన మత్స్యకారులు నాటు పడవలపై వెళ్లి జోరుగా చేపలవేట సాగిస్తున్నారు.