
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
అడ్డతీగల: అడ్డతీగల మండలం వంగలమడుగులో భార్యను హత్య చేసిన భర్త మడకం జోగిదొరని సోమవారం అరెస్ట్ చేసినట్టు అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి సోమవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 9 న రాత్రి సమయంలో మడకం జోగిదొర వంగలమడుగు శివారులో అతని పొలంలోని చేనుమకాంలో భార్య విజయకుమారిపై అనుమానంతో కావాలనే గొడవపడి కర్రతో కొట్టి, కత్తితో నరికాడన్నారు. చనిపోయిన తరువాత భార్య శవాన్ని మంచంపై పడుకోబెట్టి ఆ రాత్రికి అదే మకాంలో నిద్రించి మరునాడు పారిపోయాడన్నారు. దీనిపై దుశ్చర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. నిందితుడిని అడ్డతీగల మండలం వేటమామిడి సెంటర్లో సోమవారం పట్టుకుని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనపర్చుకున్నామన్నారు. నిందితుడిని రంపచోడవరం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. సమావేశంలో ఎస్‌ఐ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.