
రోడ్డు ప్రమాదంలో జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృత
తగరపువలస: ఆనందపురం మండలం వేములవలస జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గంభీరం పంచాయితీలోని దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన సత్యాల వెంకట కిషోర్ కుమార్ (24) దుర్మరణం చెందాడు. జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం, మారికవలసలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కిషోర్ కుమార్, ప్రతిరోజూ తన గ్రామం నుంచి కుటుంబ సభ్యులు, ఇతరులను కూరగాయల మార్కెట్‌లో దించి, ఆటో సర్వీస్ చేస్తూ విధులకు వెళ్తుంటాడు. ఉదయం 4:10 గంటల సమయంలో వేములవలస వద్ద ఆగి ఉన్న ఒక వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో కిషోర్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో మృతదేహాన్ని భీమిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిషోర్ కుమార్‌కు రెండేళ్ల పావనితో వివాహం జరిగింది. అతని మృతితో దుక్కవానిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.