
ప్రజాప్రతినిధులను అధికారులు విస్మరిస్తే ఉపేక్షించేదిలేద
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరిక
చింతపల్లి: మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులను విస్మరిస్తే ఉపేక్షించేదిలేదని పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు.మండల కేంద్రంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సీతామహాలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. అరుకు ఎంపీ గుమ్మ తనూజారాణి నిధులతో పంచాయతీలకు వీధి దీపాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారం ఉన్నప్పటికీ స్థానికంగా ప్రజలతో ఎన్నుకోబడిన తామంతా అధికారంలో ఉన్నామని, ఆ విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలన్నారు. పంచాయతీల్లో పెన్షన్లు. రేషన్ కార్డులు, కుల ఆదాయ, మరణ ధ్రువపత్రాల మంజూరులో జాప్యం చేస్తున్నట్టు తనకు ఫిర్యాదు వస్తున్నాయని, అటువంటిది జరగకుండా చూసుకోవాలన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వ నిర్ణయంతో జీకే విధిలో 22 పాఠశాలలు మూతపడ్డాయని , దీంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని 17 పంచాయతీల సర్పంచులకు వీధి దీపాలను పంపిణీ చేశారు. అనంతరం డైరీ ఫారం ప్రాంగణంలో అరుకు ఎంపీ అభివృద్ధి నిదులు రూ.40 లక్షలతో చేపడుతున్న కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శెట్టి వినయ్, ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి సభ్యుడు పోతురాజు బాలయ్య పడాల్, సర్పంచ్ దురియా పుష్పలత, రాష్ట్ర ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి గుణబాబు, ససర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులను అధికారులు విస్మరిస్తే ఉపేక్షించేదిలేద