
‘వ్యవసాయ పాలిటెక్నిక్’ను కొనసాగించాలని ఉద్యమం
చింతపల్లి: స్థానిక సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపడతామని రాష్ట్ర గిరి జన జాగృతి సమన్వయ సమితి అధ్యక్షుడు ముర్ల వెంకటరమణ అన్నారు.ఆదివారం చింతపల్లి గిరిజన ఉద్యోగులు భవన్‌లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యం కలిగిన సేంద్రి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేయడమంటే మన్యం ప్రాంతానికి అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ అనూషదేవి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఎత్తివేత ఉత్తర్వులు ఉపసంహరించుకోకుంటే అన్ని పక్షాలతో కలసి పోరాటం చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ బాలయ్య పడాల్,జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్,కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రీమల జయభారత్ తదితరులు పాల్గొన్నారు.