హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు | - | Sakshi
Sakshi News home page

హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు

Jul 10 2025 7:05 AM | Updated on Jul 10 2025 7:05 AM

హైడ్ర

హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు

మహారాణిపేట (విశాఖ): అనంతగిరి మండలం గుజ్జలి, చిట్టంవలసలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు నెలకొనడమే కాకుండా పర్యావరణం, రైతులకు నష్టం జరగనున్న దృష్ట్యా ప్రాజెక్టుల సర్వే నిలిపివేసి, అనుమతులను తక్షణమే రద్దు చేయాలని తీర్మానించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతగిరి జెడ్పీటీసీ (సీపీఎం) డి.గంగరాజు మాట్లాడుతూ ఏజెన్సీలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చట్ట విరుద్ధమన్నారు. వీటివల్ల చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గిరిజన చట్టాలను ఉల్లంఘించడంతోపాటు 1/70 చట్టాన్ని తూట్లు పొడినట్టే అన్నారు. ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై బుధవారం నిర్వహించిన గ్రామసభలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల రైవాడ జలాశయం నీరు కూడ కలుషితం అవుతుందని, దీనివల్ల ఇటు రైతులు అటు విశాఖ నగరానికి తాగునీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌ల వల్ల గిరిజనులకు ఎంతోనష్టం జరుగుతుందన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. దీనిపై ఏఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, వైఎస్సార్‌సీపీ సభ్యులు ఈర్లె అనురాధ, చెట్టి రోషిణి, కె.నూకరాజు, సన్యాసిరాజు, ఎంపీపీ బి.రమేష్‌బాబు, అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు తదితరులు హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం విరమించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉచిత విత్తనాలు అందించాలని, రైతు భరోసాకు సంబంధించి రైతుల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు తగ్గడానికి కారణాలు తెలియజేయాలని పలువురు సభ్యులు కోరారు. గిరిజనులకు కేజీహెచ్‌లో సరియైన వైద్యం అందడం లేదని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.లక్షలు వసూలు చేస్తున్నారని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు అందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలు అందజేస్తే విచారణ చేస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌హరేందిర ప్రసాద్‌ చెప్పారు. కేజీహెచ్‌లో ఎస్టీ సెల్‌ కూడా బాగా పనిచేస్తున్నందున ఈ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గిరిజన ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర సూచించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి మాట్లాడుతూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంబులెన్సులు తక్కువగా ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనిపై ఏఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పందిస్తూ సీఎస్సార్‌ నిధులు వెచ్చించి అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ గిరిజన ప్రాంత వైద్యశాలల్లో వైద్యనిపుణులు అందుబాటులో లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీరిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. అరకు జెడ్పీటీసీ చెట్టి రోషిణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభించి నెల రోజు లు కావస్తున్నా ఉపాధ్యాయులు రాకపోవడం బాఽ దాకరమన్నారు. సంఘ సమావేశాలు, సర్వ సభ్య సమావేశాలు వేర్వేరుగా నిర్వహించాలని పలువురు సభ్యులు కోరగా అందుకు జెడ్పీ చైర్‌పర్సన్‌ అంగీకరించారు. అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఉప ముఖ్య కార్యనిర్వ హణాధికారి, కె.రాజ్‌ కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

ఏజెన్సీలో గిరిజనులకు చాలా నష్టం

తక్షణమే సర్వే నిలిపివేసి, అనుమతులు రద్దుచేయాలి

పలువురు సభ్యుల డిమాండ్‌

ఉమ్మడి విశాఖ జెడ్పీ సర్వసభ్య

సమావేశంలో ప్లకార్డులతో నిరసన

సభ్యుల సూచన మేరకు ప్రాజెక్ట్‌ల రద్దుకు తీర్మానం

హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు 1
1/1

హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement