
ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు
రాజవొమ్మంగి: మండలంలోని ఎర్రంపాడు జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాకరాయి గ్రామానికి చెందిన అచ్చిబాబు, సూరిబాబు, లోవరాజు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే రంపచోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వట్టిగెడ్డ వద్ద ఎదురుగా వస్తున్న మోటారుబైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటారుబైక్‌పై ప్రయాణిస్తున్న మండలంలోని దాకరాయి గ్రామానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. వీరు తాపీ పనికి దాకరాయి నుంచి వట్టిగెడ్డ గ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని వైద్యులు నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాజవొమ్మంగి ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు.