దయచేసి వినండి.. విశాఖ రైళ్లకు పేర్లు | - | Sakshi
Sakshi News home page

దయచేసి వినండి.. విశాఖ రైళ్లకు పేర్లు

Jul 13 2025 7:25 AM | Updated on Jul 13 2025 7:25 AM

దయచేసి వినండి.. విశాఖ రైళ్లకు పేర్లు

దయచేసి వినండి.. విశాఖ రైళ్లకు పేర్లు

మళ్లీ తెరపైకి ప్రతిపాదన ●
● 2022లో వాల్తేరు డివిజన్‌లోని 17 రైళ్లకు పేర్లు మార్చాలని విజ్ఞప్తి ● మూడేళ్లయినా స్పందించని జోన్‌ అధికారులు ● జోన్‌కు జీఎం నియామకంతో మరోసారి తెరపైకి పేర్ల మార్పు అంశం ● వాల్తేరు ఎక్స్‌ప్రెస్‌, రుషికొండ, సింహాచలం, వంశధార, ఉక్కునగర్‌ తదితర పేర్ల ప్రతిపాదన

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా.. చారిత్రక ప్రశస్థి కలిగిన వాల్తేరు డివిజన్‌ కనుమరుగవుతుందేమోనన్న ఆందోళన అందరిలోనూ కొనసాగుతూనే ఉంది. జోన్‌ సరిహద్దుల డీపీఆర్‌లో స్వల్ప మార్పులు ఉండే సూచనలున్నాయని రైల్వేవర్గాలు చెబుతున్నా.. ఆ పరిస్థితులేమీ కనిపించడం లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వాల్తేరు డివిజన్‌ వైభవాన్ని చాటి చెప్పేలా కొన్ని రైళ్లకు ఇక్కడి చారిత్రక పేర్లు పెట్టాలనే మూడేళ్ల క్రితం నాటి ప్రతిపాదన మరోసారి వినిపిస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్న వివిధ రైళ్లకు ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నదులు, ప్రాంతాల పేర్లు పెట్టాలంటూ 2022లో అప్పటి వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ అధికారులకు లేఖ రాశారు. మొత్తం 17 రైళ్లకు మంచి పేర్లు సూచిస్తూ వాటిని మార్చే అంశంపై ఆలోచన చేయాలని కోరారు.

సామాన్యులు సైతం గుర్తించేలా..

ప్రస్తుతం నడుస్తున్న ఈ 17 రైళ్లకు సరైన పేర్లు లేవు. దీంతో ప్రయాణికులు ట్రైన్‌ నంబర్లు గుర్తు పెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ పరిధిలోని వారసత్వ ప్రాంతాలు, చారిత్రక ఆనవాళ్లను ఈ రైళ్లకు పేర్లుగా పెడితే.. సామాన్య ప్రయాణికులు కూడా సులువుగా గుర్తించగలుగుతారు. అయితే మూడేళ్ల క్రితం నాటి ఈ ప్రతిపాదనను అప్పటి ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ అధికారులు బుట్టదాఖలు చేశారు. కొత్త జోన్‌ ఏర్పడేందుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో వాల్తేరు చారిత్రక ఆనవాళ్లని కొనసాగించేందుకు ఈ 17 రైళ్లకు ప్రతిపాదించిన పేర్లు పెట్టాలంటూ రైల్‌ యూజర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. జీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రతిపాదనను వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు.

పేర్లు పెట్టాలని ప్రతిపాదిస్తున్న రైళ్లివే..

ట్రైన్‌ నం నుంచి– వరకూ ప్రతిపాదిత పేరు

12861/62 విశాఖ–కాచిగూడ–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వాల్తేరు ఎక్స్‌ప్రెస్‌

18519/20 విశాఖ–ఎల్టీటీ–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రుషికొండ ఎక్స్‌ప్రెస్‌

18551/52 విశాఖ–కిరండూల్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ దంతేశ్వరి ఎక్స్‌ప్రెస్‌

18514/13 విశాఖ–కిరండూల్‌–విశాఖ నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ దండకారణ్య ఎక్స్‌ప్రెస్‌

22820/19 విశాఖ–భువనేశ్వర్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ వంశధార ఎక్స్‌ప్రెస్‌

18518/17 విశాఖ–కోర్బా రైల్వే స్టేషన్‌ సింహాచలం ఎక్స్‌ప్రెస్‌

20811/12 విశాఖ–నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ మత్స్యకుండ్‌ ఎక్స్‌ప్రెస్‌

18512/11 విశాఖ–కోరాపుట్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ కోలాబ్‌ ఎక్స్‌ప్రెస్‌

18573/74 విశాఖ–భగత్‌కీ కోఠీ ఎక్స్‌ప్రెస్‌ కురుసుర ఎక్స్‌ప్రెస్‌

18567/68 విశాఖ–కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ సాగరకన్య ఎక్స్‌ప్రెస్‌

20816/15 విశాఖ–టాటా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉక్కునగర్‌ ఎక్స్‌ప్రెస్‌

22869/70 విశాఖ–చైన్నె సెంట్రల్‌ (ఎంఏఎస్‌) సూ.ఫా ఎక్స్‌ప్రెస్‌ సువర్ణరేఖ ఎక్స్‌ప్రెస్‌

18503/04 విశాఖ–సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ ప్రెస్‌ ఎల్లోరా ఎక్స్‌ప్రెస్‌

22874/73 విశాఖ–దిఘా ఎక్స్‌ప్రెస్‌ గోస్తనీ ఎక్స్‌ప్రెస్‌

22847/48 విశాఖ–ఎల్‌టీటీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛత్రపతి ఎక్స్‌ప్రెస్‌

20803/04 విశాఖ–గాంధీధామ్‌ ఎక్స్‌ప్రెస్‌ కచ్‌ ఆంధ్ర ఎక్స్‌ప్రెస్‌

22801/02 విశాఖ–చైన్నె సెంట్రల్‌ (ఎంఏఎస్‌) సూ.ఫా ఎక్స్‌ప్రెస్‌ సౌత్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement