
హైడ్రో పవర్ ప్రాజెక్టుఅనుమతులు రద్దు చేయాలి
ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం గిరిజన చట్టాలు, హక్కులను కాలరాస్తూ, ఏజెన్సీకి విఘాతం కలిగించే ప్రాజెక్టులపై ఏకపక్ష అనుమతులు జారీ చేయడం తగదని ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య అన్నారు. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మి గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అనంతగిరి మండలం పెద్దకోటలో అదానీ కంపెనీకు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవో 51 కాపీలను నేతలు, గిరిజనులు దగ్ధం చేశారు. జీవో 51ను వెనక్కి తీసుకోవాలని, ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి నర్సయ్య మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల ఏజెన్సీకి పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. ఆదివాసీలు అభిప్రాయాలు, గ్రామసభలో తీర్మానం లేకుండా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం అన్యాయమన్నారు. రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో ఉన్న పెద్దకోట ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలులో ఉందన్నారు. కూటమ ప్రభుత్వం ఆయా చట్టాలను ఉల్లంఘించిందన్నారు. పెద్దకోట ప్రాంతంలో ఆదివాసీలు నీటి అవసరాలు, అక్కడ వాగులపై ఆధారపడి జీవిస్తున్నారని, అటువంటి వాగులపై హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం తరలిస్తే ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 51ను రద్దు చేయాలని,లేనిపక్షనా ఆదివాసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. నాయకులు శ్రీను, చందు, దేవన్న, చంద్రయ్య పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుమ్ పంచాయతీ జాకరవలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో 51 జీవో ఉత్తర్వులు అనుమతులు రద్దు చేయాలని జీవో కాపీని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ అనంతగిరి మండలం పెద్దకోట గ్రామ పంచాయతీలో ఆదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు పీసా గ్రామసభ నిర్వహించకుండా ఏక పక్షంగా అనుమతులు ఇస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్–51కి ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. జీవో నెంబర్ 51 తక్షణమే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలోని అటవీ సంపదను దోచుకునే యేచనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. గిరిజన సంపద జోలికి వస్తే సహించమని, ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు రామంచదర్, రాజు, భాస్కర్‌రావు, భగత్, రుకుదార్ తదితరులు పాల్గొన్నారు.
గూడెంకొత్తవీధి: అరకు నియోజకవర్గం అనంతరిగి మండలం పెద్దకోట గ్రామ పంచాయతీలో ఆదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టు మంజూరుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 51ని వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కొర్ర బాలయ్య తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జీవో కాపీలు దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలయ్య మాట్లాడుతూ ఆ ప్రాజక్ట్ నిర్మాణం చేస్తే గిరిజనులకు తీరని నష్టం వాటిల్లుతుందనామ్నరు. జీవోను రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు కేశవరావు, మంగిబాబు, రమేష్, బాబూరావు, కొండబాబు పాల్గొన్నారు.
ఏజెన్సీకి విఘాతం కలిగించే ప్రాజెక్టును విరమించుకోవాలి
ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్
జీవో కాపీలను దహనం చేసిన నేతలు
ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

హైడ్రో పవర్ ప్రాజెక్టుఅనుమతులు రద్దు చేయాలి

హైడ్రో పవర్ ప్రాజెక్టుఅనుమతులు రద్దు చేయాలి