
జీసీసీ అధికారులపైకలెక్టర్ ఫిర్యాదు
● కాఫీ కొనుగోలు సొమ్ము జమచేసేలా చర్యలు తీసుకోవాలని వినతి
గూడెంకొత్తవీది: కాఫీని విక్రయించి నెలలు గడుస్తోన్నా జీసీసీ అధికారులు ఇంత వరకు ఖాతాల్లో నగదు జమ చేయలేదని గూడెం పంచాయతీ కొత్తపల్లికి చెందిన రైతులు శుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితం 6,200 కిలోల కాఫీని జీసీసీకి విక్రయించామన్నారు. ఇందుకు సంబంధించి రూ.20 లక్షలు తమ ఖాతాల్లో వేయాల్సి ఉందన్నారు. 24 గంటల్లో డబ్బులు వేసేస్తామని చెప్పిన జీసీసీ అధికారులు ఇంత వరకు జమచేయలేదన్నారు. దీనిపై స్పందించి వెంటనే నగదుకు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీసీసీ అధికారులపై చర్యలు చేపట్టాలని వారు కలెక్టర్‌ను కోరారు.