
ప్రారంభానికి సిద్ధంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో నిర్మించిన కలెక్టర్ క్యాంప్ కార్యాలయ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. చింతపల్లిలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చింతపల్లి నుంచి చౌడుపల్లికి వెళ్లే మార్గంలో స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు ఎదురుగా ఉన్న డైయిరీ ఫారంలో స్థలాన్ని కేటాయించారు. రూ.కోటి వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. చింతపల్లి,జీకే వీధి, కొయ్యూరు మండలాల ప్రజలకు కలెక్టర్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్న క్యాంప్ కార్యాలయ భవనం పనులు పూర్తి కావచ్చాయి.