
ఆకట్టుకున్న మాక్ డ్రిల్
చింతూరు: యుద్ధ సన్నద్ధత, విపత్తు నిర్వహణలో భాగంగా గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి మాక్‌డ్రిల్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించేందుకు మాక్‌డ్రిల్ ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ రమణారావు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సాయికిషోర్‌రెడ్డి, ఆర్ధోపెడిక్ డాక్టర్ కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు.
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో..
మోతుగూడెం: లోయర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రం వద్ద జెన్‌కో సెక్యూరిటీ విభాగం, ఉద్యోగులు, అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రతిస్పందన, సంసిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను అంచనా వేసేందుకు జెన్‌కో సెక్యూరిటీ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో జెన్‌కో ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.