మోసపూరిత హామీలతో ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
డుంబ్రిగుడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకం పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఇంతకంటే ప్రజలకు వెన్నుపోటు మరొకటి ఉండదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈనెల 4న అరకులోయలోని నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అమలుకాని, అమలుచేయని హామీలతో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొవాలని ఆయన కోరారు. వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు, అరకులోయ మండల పార్టీ అధ్యక్షుడు రామ్మూర్తి, నాయకులు రేగం చాణక్య, అశోక్‌కుమార్, కృష్ణారావు, బాకా సింహాచలం, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కె.హరి, సర్పంచ్‌లు వంతల వెంకటరావు, గుమ్మ నాగేశ్వరరావు, వై.సుబ్బారావు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
4న వెన్నుపోటు దినం
అరకులోయలో భారీ ర్యాలీ, సమావేశం
వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరండి
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు


