గైనకాలజిస్ట్‌ నియామకం | - | Sakshi
Sakshi News home page

గైనకాలజిస్ట్‌ నియామకం

May 4 2025 6:45 AM | Updated on May 4 2025 6:45 AM

గైనకాలజిస్ట్‌ నియామకం

గైనకాలజిస్ట్‌ నియామకం

చింతపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఎట్టకేలకు గైనకాలజిస్ట్‌ను నియమిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్‌ పోస్టులు ఉండగా ఒక్కరే ఉన్నారు. ఆమె కూడా ప్రసూతి సెలవులో ఉన్నందున గిరిజన మహిళలు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మైదాన ప్రాంతానికి చెందిన ౖవైద్యులను డిప్యూటేషన్‌పై నియమిస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు. తాజా నియామకాల్లో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఒకదానిని భర్తీ చేశారు. ఈ మేరకు నియమితులైన గైనకాలజిస్ట్‌ వాసవి శనివారం విధుల్లో చేరారు. గాయత్రి వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసినట్టు ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement