
ఒత్తిడి దూరం చేసే గొప్ప మందు నవ్వు
నవ్వుల్లో గిన్నిస్ రికార్డ్
రకరకాల ఒత్తిళ్లతో మనిషి నవ్వుకు దూరమయ్యాడు. మానసిక ఒత్తిడిని దూరం చేసి.. రెండు మూడు గంటల పాటు నవ్వించే లక్ష్యంతో 2008లో ఐదుగురు స్నేహితులతో కలిసి ‘లాఫ్టర్స్ ఫన్ క్లబ్’ను స్థాపించాను. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, ఉల్లాసం అందించేందుకు మా కామెడీ క్లబ్ కృషి చేస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూనే.. నవ్వించడాన్ని ఒక ప్రవృత్తిగా మార్చుకున్నాను. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాం. ఒక గంట వ్యవధిలో 654 జోకులు చెప్పి 2013లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాను. 2011లో 35 గంటల పాటు నిర్విరామంగా జోకులు చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాను. 2015లో ఒక్క నిమిషంలో 37 జోకులు చెప్పి మరో లిమ్కా బుక్ రికార్డును సైతం సాధించాను. ఇలా చాలా అవార్డులు, సత్కారాలు అందుకున్నాను. విశాఖలో ప్రత్యేకంగా ఐదారు కామెడీ క్లబ్‌లు ప్రజలను నవ్వించడం కోసం స్వచ్ఛందంగా కృషి చేస్తున్నాయి. మా క్లబ్ ప్రదర్శించే నాన్‌స్టాప్ కామెడీ కోసం ఆదివారం సాయంత్రం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. నేను, క్లబ్ అధ్యక్షుడు జి.వి.త్రినాథ్, పి.కె.దుర్గాప్రసాద్, ఎన్.ఎస్.ఆర్. కృష్ణారావు, మల్లిక, రమ జోషిత కలిసి స్కిట్స్ ప్రదర్శిస్తుంటాం.
–కోరుకొండ రంగారావు, లాఫ్టర్స్ ఫన్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం

ఒత్తిడి దూరం చేసే గొప్ప మందు నవ్వు