
గళమెత్తిన జర్నలిస్టు సంఘాలు
అరకులోయ టౌన్: నోటీసులు జారీ చేయకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడంపై జర్నలిస్టు సంఘాలు గళమెత్తాయి. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని ఏపీయూడబ్ల్యూజే అరకు అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌బీ వెంకటేశ్వరరావు, ఆర్. రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ ఎంవీవీ ఎంవీవీ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. పత్రికలు నిజాలు రాస్తే రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఇటువంటి చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కాపుగంటి హరిబాబు, బి. అనిల్, బి. కొండ, సుంకరి ఆనందరావు, జగదీష్, ఈశ్వరరావు, రాజు, భీమన్న, ఎస్. సోమేశ్వరరావు, పాల్గొన్నారు.
గంగవరం : సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడపై విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై గంగవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వాడపల్లి శేషాచార్యులు, గంగవరం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు జయకృష్ణ పట్నాయక్, వివిధ పత్రికల విలేకరులు వైఆర్‌కే ప్రసాద్, నాగేశ్వరరావు, ప్రభాకర్, ఉదయ్, రత్నం తదితరులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ స్పందనను కలిసి వినతిపత్రం అందజేశారు.
చింతూరు : సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని ఖండిస్తూ చింతూరు, మోతుగూడెం విలేకరులు అలీ, శ్రీరామచంద్రమూర్తి స్థానిక తహసీల్దార్ సీహెచ్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు.
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసు సోదాలపై ఖండన
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
కలిగించడమేనని ఆవేదన
వినతిపత్రాలు అందజేసి నిరసన

గళమెత్తిన జర్నలిస్టు సంఘాలు

గళమెత్తిన జర్నలిస్టు సంఘాలు