
తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలి
పాడేరు రూరల్: బందులు, దీక్షలు చేస్తున్న వారిపై టీడీపీకి చెందిన సర్పంచ్ పాంగి పాండురంగస్వామి హేళన చేస్తు తప్పుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడ సురేష్‌కుమార్ హెచ్చరించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక డీఎస్సీతో గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు మేలు కలుగుతుందని ఉద్దేశంతో మద్దతు ఇస్తూ ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తుంటే.. తిన్నది అరగక దీక్షలు, బంద్‌లు చేస్తున్నారని టీడీపీకి చెందిన సర్పంచ్ పాంగి పాండురంగస్వామి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. పాండురంగ నీవు కూడా ఓ గిరిజనుడు అని మర్చిపోయి పనికిమాలిన ప్రకటనలు చేయడం భావ్యం కాదని.. మీ నాయకుడు చంద్రబాబు జీవో నెంబరు–3 పునరుద్ధరణ, ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నైతిక హక్కు ఉంటే బంద్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం దొంగ హమీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసిందన్నారు. గిరిజన చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.
సర్పంచ్ పాండురంగస్వామి
వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు