
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మోతుగూడెం: మేడే సందర్భంగా లోయర్ సీలేరు ఏపీ జెన్‌కో ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు లెమన్ అండ్ స్పూన్ చైర్స్, బొట్టు ఆట నిర్వహించారు. పోటీల్లో విజేతలకు సీలేరు కాంప్లేక్స్ సీఈ వాసుదేవరావు, ఎస్‌ఈ చిన్న కామేశ్వరరావు, ప్లాంట్ మేనేజర్ బాలకృష్ణ తదితరులు బహుమతులు అందజేశారు. బాలబాలికలు భరతనాట్యం ప్రదర్శించారు. లోయర్ సీలేరు జెన్‌కో ఉద్యోగులు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. జెన్‌కో ఉద్యోగులు సతీష్ రాఘవన్ పిల్లే, పూర్ణిమ, రత్నాకర్, కిరణ్, దారబాబు వాసు, ప్రసాద్ పాల్గొన్నారు.