
మన్యం బంద్ విజయవంతానికి పిలుపు
రాజవొమ్మంగి: జీవో నంబర్–3ను పునరుద్ధరించాలని, ఏజెన్సీకు స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్లతో వచ్చేనెల 2న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మండలంలోని ముంజవరప్పాడు గ్రామంలో ఆదివాసీ నాయకుల నేతృత్వంలో మంగళవారం సమావేశం జరిగింది. నాయకులు తాము సూరిబాబు, బాలకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలు అన్ని ఆదివాసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీ నిరుద్యోగ యువతకు నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, మాట తప్పిందన్నారు. ఈ నెల 30 వరకు ఇచ్చి హామీల అమలుకు గడువు ఇచ్చామన్నారు. బంద్‌ను ఆదివాసీ యువత జయప్రదం చేయాలని కోరారు. నాయకులు నాగరాజు, భీమరాజు, లక్ష్మి, రామలక్ష్మి, వరలక్ష్మి, అప్పలకొండ, పాపాయమ్మ, చిన్న, తదితరులు పాల్గొన్నారు.