ఆటోలో నగల బ్యాగ్‌మరిచిపోయిన మహిళ
నక్కపల్లి : నక్కపల్లికి చెందిన ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బంగారం బ్యాగ్‌ను డ్రైవర్ నిజాయితీగా తిరిగి అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. సీఐ కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన శిరీష అనే మహిళ తుని వెళ్లేందుకు నక్కపల్లిలో ఆటో ఎక్కింది. తనతో తీసుకెళ్తున్న బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయింది. ఆందులో సుమారు రూ.7లక్షలు విలువైన ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను ఉన్నాయి. దీంతో ఆమె నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌నో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసేలోపు తునికి చెందిన ఆటోడ్రైవర్ గెడ్డమూరి అంజి నిజాయితీగా నక్కపల్లి మహిళ తన ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను, అందులో ఉన్న బంగారాన్ని నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చాడు. పోలీసుల సమక్షంలో బాధితురాలి ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేశాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి అతనికి కొంత నగదును కానుకగా అందజేశారు. సీఐ కుమార స్వామి ఆటోడ్రైవర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.